చట్టంపై పాఠం.. చరవాణులతో కాలక్షేపం
కరీంనగర్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో కొందరు హెచ్‌ఎంలు ఫోన్లతో కాలక్షేపం చేస్తూ కెమెరాకు చిక్కారు. ఓ వైపు పోక్సో కేసు గురించి సీనియర్ సివిల్ జడ్జి దిశా నిర్దేశాలు చేస్తుండగా మరో వైపు చరవాణుల్లో నిమగ్నం కావడం సరికాదని పలువురు వాపోయారు.