అన్నారం రైతులకు న్యాయం చేయాలి: ఎమ్మెల్యే
SRD: గుమ్మడిదల మున్సిపాలిటీలో సర్వే నంబర్ 109లోని 140 మంది రైతులకు సంబంధించిన 160 ఎకరాలను గత సంవత్సరం TGIICకి ప్రభుత్వం కేటాయించింది. ఆ సమయంలో నష్టపరిహారంతో పాటు 100 గజాల ఇళ్ల స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చిన నేటి వరకు అమలుకావడం లేదంటూ రైతులు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.