కురుమూర్తి జాతరలో దొంగల చేతివాటం

కురుమూర్తి జాతరలో దొంగల చేతివాటం

MBNR: జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం కురుమూర్తి జాతరలో దొంగలు మంగళవారం చేతివాటం ప్రదర్శించారు. లాల్ కోటకు చెందిన నరసింహులు జేబును కత్తిరించి రూ.10 వేలు దోచుకున్నారు. జాతర సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ దొంగతనాలు జరుగుతుండడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.