మాజీ MLA రోహిత్ రెడ్డికి BRS షోకాజ్ నోటీసు
VKB: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. హైదరాబాద్ శివార్లలో జరిగిన ఓ పార్టీలో రోహిత్ డ్రగ్స్ తీసుకున్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇలాంటి విషయాల్లో పార్టీ అధినాయకత్వం కఠినంగా ఉంటుందని, అస్సలు రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.