ఓయూలో బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ

మేడ్చల్: ఆదివాసీల హక్కుల సాధనకై 28న భద్రాచలంలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. ఆదివాసి 9 తెగల రాష్ట్రస్థాయి మేధోమదనం కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని గెస్ట్ హౌస్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.