'భారీగా వరద.. అప్రమత్తంగా ఉండాలి'

'భారీగా వరద.. అప్రమత్తంగా ఉండాలి'

NTR: పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి 65,000 క్యూసెక్కుల వరద నీరు విడుదలవుతోందని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. బుధవారం మధ్యాహ్నానికి వరద బ్యారేజీకి చేరుకుని, ఆ తర్వాత మూడు లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని ఆయన వివరించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.