కలుషిత ఆహారం తిన్న 14 మందికి అస్వస్థత

AKP: కలుషిత అల్పాహారం తిన్న 14 మంది అస్వస్థతకు గురయ్యారు. నాతవరం పరిసర ప్రాంతాలకు చెందిన 20 మంది పాడేరు మోదకొండమ్మ దర్శనానికి బయలుదేరారు. మార్గమధ్యంలో పాడేరు ఘాట్ రోడ్డులో తమ వెంట తెచ్చుకున్న అల్పాహారం తిని 14 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం పాడేరు జిల్లా ఆస్పత్రిలో వారు చికిత్స పొందుతున్నారు.