VIDEO: పొన్నూరులో భారీ వర్షం

GNTR: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పొన్నూరు మండలంలో ఈరోజు భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో 7, 22, 23, 24 వార్డులలోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలో ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రానున్న మూడు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్ జియాబుల్ హక్ హెచ్చరించారు.