డంపింగ్ యార్డ్‌గా మారిన పోతురాజుకుంట

డంపింగ్ యార్డ్‌గా మారిన పోతురాజుకుంట

NLGఫ చిట్యాల గ్రామ శివారులో ఉన్న పోతురాజుకుంట చెత్త చెదారంతో నిండి, డంపింగ్ యార్డ్‌ను తలపిస్తుంది. దీంతో వర్షపు నీరు వెళ్లే మార్గం మూసుకుపోయాయి. రైల్వే బ్రిడ్జి సమీపంలోని షాపులు, ఇళ్లలోకి నీరు చేరుతోంది. దోమల బెడద ఎక్కువై దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని ఆదివారం స్థానికులు వాపోయారు. నిలిచిన నీటిని తొలగించి కుంటను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.