వైద్య చికిత్స కోసం చేయూత

వైద్య చికిత్స కోసం చేయూత

BDK: బూర్గంపాడు మండలం గౌతమి పురంకు చెందిన హుస్సేన్ బి అనారోగ్యంతో వైద్య చికిత్స నిమిత్తం వసుధ ఫౌండేషన్‌ను అభ్యర్థించారు. సానుకూలంగా స్పందించిన ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెంకట రామరాజు ఇవాళ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పోదెం వీరయ్య చేతుల మీదుగా పదివేల ఆర్థిక సహాయం అందజేశారు. నిరుపేదలకు సహాయం అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామన్నారు.