'జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ దే'
ఆదిలాబాద్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే పద్ధతి కాంగ్రెస్ పార్టీదేనని TPCC రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బజార్హత్నూర్ మండలంలోని పిప్పిరి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. డిప్యూటీ CM మల్లు భట్టి విక్రమార్క తన పాదయాత్ర ద్వారా తెలుసుకున్న సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు.