ఇళ్ల మధ్యే మురుగునీరు..!
VKB: బషీరాబాద్ మండలం దామర్చేడ్‌లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా 7వ వార్డులో మురుగు నీరు పారే మార్గం లేక ఇళ్ల మధ్యనే నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిలిచిన నీటిలో దోమలు చేరి రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని, కాలనీ అంతా దుర్వాసన వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.