గన్నవరానికి రేపు సీఎం రాక..!
కృష్ణా జిల్లా గన్నవరంలోని మాదవారిగూడెంకు సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. అయితే స్థానిక రైతు మాదల శేఖర్‌కు చెందిన మామిడితోటలో నిర్వహించనున్న అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు విడుదల కార్యక్రమానికి సీఎం శుక్రవారం హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. సీఎం పర్యటక కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు విజయవంతం చేయాలని కోరారు.