లారీని ఢీకొన్న బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు

ప్రకాశం జిల్లా పొదిలి మండలం తలమల్ల సమీపంలో ఆదివారం రాత్రి ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని మొదట పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.