అనంతపురంలో నియోజకవర్గ మాక్ అసెంబ్లీలు
ATP: జిల్లాలో ఈనెల 6న నియోజకవర్గ స్థాయిలో, 10న జిల్లా స్థాయిలో మాక్ అసెంబ్లీలు నిర్వహించనున్నట్లు డీఈవో ప్రసాద్బాబు తెలిపారు. మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులతో స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి పాత్రలతో కార్యక్రమాన్ని శాసనసభ తరహాలో నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.