జాతీయ లోక్ అదాలత్ వాయిదా

SKLM: ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, మే 10న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్‌ను జూలై 5వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జూనైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మార్పును కక్షిదారులు, న్యాయవాదులు, ప్రభుత్వ, పోలీసు శాఖల అధికారులు గమనించాలన్నారు.