రెండో రోజు కొనసాగుతున్న 'ఆర్టీసీ' సమ్మె
KNR: రాష్ట్రవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా ఉమ్మడి కరీంనగర్(D)లో రెండో రోజు ఆర్టీసీ కార్మికులు విధులను బహిష్కరించారు. స్థానిక డిపోల ఎదుట బైఠాయించి కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. కార్మికుల సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.