వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

ఆసిఫాబాద్: జిల్లా కేంద్రం రాజంపేటకు చెందిన నక్క మధుకర్ ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో అదృశ్య కేసు నమోదు చేసినట్లు శనివారం CI బాలాజీ వరప్రసాద్ పేర్కొన్నారు. గత నెల 27న ఇంటి నుంచి దుస్తులు, కొంత నగదు తీసుకొని బయటకు వెళ్లినట్లు తెలిపారు. తండ్రి ఎల్లయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు.