VIDEO: తెగిపోయిన మల్లన్నసాగర్ కాలువ
SDPT: యాసంగి పంటకు నీళ్లు అందించడానికి ప్రాజెక్టు నుంచి ఎక్కువ మొతాదులో నీళ్లు విడవడంతో తొగుట మండలం ఎల్లారెడ్డిపేట వద్ద బొల్లక్క చెరువు సమీపంలో కాలువ తెగిపోయింది. దుబ్బాక ప్రధాన కాలువ పంట పొలాల మీదుగా నీటి ప్రవాహం వెళ్లడంతో రైతులకు తీరని నష్టం జరిగింది. అధికారులు వెంటనే స్పందించి కాలువకు మరమ్మతులు చేయలని రైతులు కోరుతున్నారు.