గిరిజన భూముల ఆక్రమణలపై ఫిర్యాదు

గిరిజన భూముల ఆక్రమణలపై ఫిర్యాదు

ASR: కొయ్యూరు మండలం రత్నంపేటలో గిరిజనేతరుల ఆక్రమణలు, చట్టవిరుద్ధ నిర్మాణాలపై రంపచోడవరంలో ఏపీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సోల బొజ్జిరెడ్డిని కలిసి ఫిర్యాదును గిరిజన యువకుడు పాటి చంద్రశేఖర్ శుక్రవారం అందజేశారు. 1/70 చట్టం ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఫిర్యాదును పరిశీలించి విచారణకు ఆదేశిస్తామని ఛైర్మన్ హామీ ఇచ్చారు.