మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్యోగుల ధర్నా

మున్సిపల్ కార్యాలయం వద్ద  ఉద్యోగుల ధర్నా

KRNL: ఆదోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఔట్ సోర్స్ సిబ్బంది సోమవారం ధర్నా నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో టెక్నికల్ సిబ్బందికి రూ.29,000, నాన్ టెక్నికల్‌కు రూ.24,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 15 సంవత్సరాలు పైబడిన సిబ్బందిని రెగ్యులర్ చేయాలని, మరణిస్తే రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.