పార్నపల్లిలో స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని సందర్శించిన MPDO
NDL: బండి ఆత్మకూరు మండలం పార్నపల్లి స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని ఎంపీడీవో గాయత్రి బుధవారం సందర్శించారు. స్వర్ణ గ్రామ సిబ్బందికి సంబంధించిన ఇన్-టైమ్, అవుట్-టైమ్ హాజరును పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. ఉద్యోగులు సమయపాలన పాటించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు. గ్రామంలో జరుగుతున్న సర్వేలను త్వరగా పూర్తి చేయాలన్నారు.