VIDEO: ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన్‌లో పారిశుద్ధ్య లోపం
SS: సత్యసాయి బాబా జయంతి వేడుకలు సమీపిస్తున్న వేళ పుట్టపర్తి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ అపరిశుభ్రతకు నిలయంగా మారింది. వివిధ ప్రాంతాలు, విదేశాల నుంచి వచ్చే వేలాది మంది భక్తులకు చెత్త కుప్పలు, మరుగుదొడ్ల దుస్థితి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. రైల్వే అధికారులు వెంటనే శ్రద్ధ వహించి రైల్వే స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.