VIDEO: రాఘవేంద్ర కాలనీలో పైపులైన్ లీకేజీ

GDWL: జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలో, గద్వాల - రాయిచూర్ బైపాస్ రోడ్డు పక్కన ఉన్న పైపులైన్ లీకవుతోంది. ఈ లీకేజీ కారణంగా నీరు షాపుల ముందు నిలిచి, వ్యాపారస్తులకు, కస్టమర్లకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. మురికి నీరు నిలిచి ఉండటం వల్ల దుర్వాసన కూడా వస్తుంది. ఈ సమస్యపై అధికారులకు స్పందించాలని కాలనీవాసులు కోరుతున్నారు.