షర్మిల రాకతో కాంగ్రెస్ పునర్జీవం

ATP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ పునర్జీవం పోసుకుందని అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి మల్లికార్జున అన్నారు. బుధవారం మల్లికార్జున పార్టీ శ్రేణులతో కలిసి పాతూరు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలను ఆయన కోరారు.