ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు

ప్రకాశం: మార్కాపురంకు చెందిన తనీర్ సురేంద్ర (33 ) అనే వ్యక్తి కుటుంబ సమస్యల కారణంగా శనివారం తాను చనిపోతున్నానని చెప్పి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తన అక్క వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. స్పందించిన ఎస్సై అంకమ్మరావు ఐటీ కోర్ టీం సాయంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సురేంద్ర ఉన్న ప్రదేశాన్ని గుర్తించి కాపాడారు.