బాసరలో సీఎం రేవంత్ మనవడి అక్షరాభ్యాసం
TG: నిర్మల్ జిల్లా బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం దంపతులు తమ మనవడు రుద్ర దేవ్‌కు అక్షరాభ్యాసం చేయించారు. ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ మహారాజ్ పలక, బలపంతో అక్షరాభ్యాసం చేయించారు. వేద పండితులు దీవెనలు అందించారు. కుమార్తె నైమిశా రెడ్డి దంపతులు సహా మంత్రులు అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్నారు.