రాష్ట్ర ఉత్తమ పురస్కారం అందుకున్న సీఐ

W.G: నరసాపురం ఎక్సైజ్ స్టేషన్ సీఐ ఎస్. రాంబాబు రాష్ట్ర స్థాయి ఉత్తమ పురస్కారం అందుకున్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఎక్సైజ్ కమిషనర్ నితీష్ కుమార్, ఐపీఎస్ అధికారి రాహుల్ దేవ్ శర్మ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సీఐ రాంబాబును ఎస్సైలు ఖాసీం, జైనులాబ్ధిన్ అభినందించారు.