భార్య పిల్లలపై దాడి చేసిన భర్తకు జైలు శిక్ష

భార్య పిల్లలపై దాడి చేసిన భర్తకు జైలు శిక్ష

కామారెడ్డి జిల్లాలో మద్యం మత్తులో భార్య, పిల్లలపై కత్తితో దాడి చేసిన వ్యక్తికి కామారెడ్డి కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. లింగంపేట్ పోలీసులు పక్కా దర్యాప్తుతో కేసును నిరూపించారని, బాధితురాలి పోరాటంతో న్యాయమూర్తి నాగరాణి సాక్ష్యాధారాలు పరిశీలించి, రెండు వేల రూపాయల జరిమానాతో పాటు శిక్ష విధించారని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.