శ్రమదానంతో గుంతలు పూడ్చిన స్థానికులు

శ్రమదానంతో గుంతలు పూడ్చిన స్థానికులు

ASR: చింతపల్లి మండలం కోరుకొండ నుంచి ఏకవలసపల్లి వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది. ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు రహదారి మరింత కోతకు గురైంది. సమస్య పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో సొంతంగా శ్రమదానం చేసుకుని గుంతలు పూడ్చుకుంటున్నారు.