అర్ధరాత్రి బస్సుల తనిఖీలు.. ఉల్లంఘనలపై కఠిన చర్యలు
గుంటూరు: మంగళగిరి ఖాజా టోల్ ప్లాజా వద్ద మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బస్సుల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలు, డ్రైవర్ల లైసెన్సులను పరిశీలించారు. 20కి పైగా బస్సులు చెక్ చేసి, నిబంధనలు పాటించని ఒక బస్సును సీజ్ చేశారు. 15 బస్సులపై జరిమానాలు విధించారు. ప్రయాణికుల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.