భగీరథ మహర్షి జయంతి వేడుకలు

NZB: కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భగీరథ మహర్షి చిత్రపటానికి జిల్లా రెవెన్యూ కలెక్టర్ విక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగీరథ మహర్షి గొప్ప యోగి అని, ప్రజల సంక్షేమం కోసం దివి నుంచి గంగను భూమికి తీసుకువచ్చారని తెలిపారు.