ఇంటర్ పరీక్షల్లో 97.91 శాతం హాజరు
కామారెడ్డి ఇంటర్మీడియట్ పరీక్షల్లో బుధవారం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 97.91 శాతం విద్యార్థులు హాజరైనట్లు ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. మొత్తం 8,183 మంది విద్యార్థులకు గాను, 8,012 మంది విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. 171 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయన్నారు.