రామన్నగూడెం వద్ద రెండోవ ప్రమాద హెచ్చరిక జారీ

రామన్నగూడెం వద్ద రెండోవ ప్రమాద హెచ్చరిక జారీ

MLG: ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరద నీరు భారీగా చేరుతుండటంతో బుధవారం అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 15.830 మీటర్లు ఉందని అధికారులు తెలిపారు. వరద ప్రవాహం కొనసాగుతుందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.