'సీఎం కొత్త డ్రామాకు తెర తీశారు'
HYD: సీఎం రేవంత్‌పై TG బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్ప తీవ్ర విమర్శలు చేశారు. మహిళలకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను పక్కదారి పట్టించడానికే ఈ చీరల పంపిణీ అని అన్నారు. సీఎం మళ్లీ కొత్త డ్రామాకు తెర తీశారని అన్నారు. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో అవే చీరలు కట్టుకొని మీకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని, మీ హస్తం మీకే బస్మాసుర హస్తంగా మారబోతుందన్నారు.