VIDEO: అర్ధవీడులో మరోసారి పెద్దపులి సంచారం

ప్రకాశం: అర్ధవీడు మండలంలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపింది. బుధవారం బోగోలు గ్రామ సమీప అటవీ ప్రాంతంలో పెద్దపులి దూడపై దాడి చేసి చంపింది. పెద్దపులి పాదముద్రలు గుర్తించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. రెండు రోజుల కిందట వెలగలపాయ గ్రామ సమీపంలో 2 ఎద్దులపై పెద్దపులి దాడి చేసి చంపిది.