మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలింది. మావోయిస్టు పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి, దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు అలియాస్ చంద్రయ్య ఆ రాష్ట్ర Dy CM విజయ శర్మ ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 17 మంది అనుచరులు కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు. గతంలో పాపారావు అనేక హింసాత్మక ఘటనలకు సూత్రధారిగా వ్యవహించినట్లు అధికారులు తెలిపారు.