వచ్చే ఎన్నికల్లో YCP గెలుపు తథ్యం: ఎమ్మెల్యే
ప్రకాశం: పుల్లలచెరువు మండలం ఐటీవరంలో శనివారం రాత్రి నిర్వహించిన సంతాన వేణుగోపాలస్వామి తిరుణాల మహోత్సవ కార్యక్రమంలో వై. పాలెం MLA తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎలక్ట్రికల్ ప్రభపై ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు తధ్యమని అన్నారు.