'ప్రయాణికుల రక్షణ RTC ప్రథమ బాధ్యత'
BHPL: జిల్లా RTC డిపోకు చెందిన డ్రైవర్లు కొమురయ్య, మున్నీ, నాయక్ తమ విధుల్లో సుదీర్ఘకాలం పాటు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాహనాలను నడిపి ఆదర్శంగా నిలిచారు. వారి అసాధారణ సేవలకు గుర్తింపుగా శనివారం WGL RM విజయభాను వారిని సత్కరించి అభినందన పత్రాలు అందజేశారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణమే ఆర్టీసీ ప్రథమ బాధ్యత అని, ఇలాంటి డ్రైవర్లు సంస్థకు గర్వకారణమన్నారు.