వరుస పెళ్లిళ్లు.. బస్సుల్లో పెరిగిన రద్దీ..!
MDCL: వరుసగా పెళ్లి ముహూర్తాలు ఉండటంతో హైదరాబాద్ నుంచి మీ వివిధ జిల్లాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. దీంతో ఉప్పల్ నుంచి హనుమకొండ, తొర్రూరు, భూపాలపల్లి ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో గత వారం రోజులుగా రద్దీ పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ నెల 29 తర్వాత శుభకార్యాలకు ముహూర్తాలు లేనందున, 29 లోపే శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకున్నారు.