'ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చే వరకు ఉద్యమిస్తాం'

'ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చే వరకు ఉద్యమిస్తాం'

BDK: అశ్వరావుపేటలో సీపీఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన నిరసన దీక్ష నేటితో 5వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన దీక్షకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలియచేశాయి. ఎటువంటి సమాచారం లేకుండా నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి తమ ఇళ్లను కూల్చివేసినందుకు ప్రజలు ఆవేదనను ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.