ధ్వజస్తంభ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే
NTR: చందర్లపాడు మండలం ఏటూరులో సోమవారం సిద్ధి బుద్ధి వినాయక స్వామి ధ్వజస్తంభ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తుల అంకితభావం వల్లే ఇలాంటి మహోత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. దేవాలయ అభివృద్ధికి అవసరమైన సహాయం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.