డీఎస్సీ స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని డిగ్రీ కళాశాల వద్ద కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు చేతుల మీదుగా ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేశారు. ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతీ యువకులు పట్టుదలతో చదివి మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని మడకశిరకు మంచి పేరు తీసుకురావాలన్నారు.