రైతులకు యూరియ టోకెన్ల పంపిణీ
WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇవాళ వ్యవసాయ అధికారులతో కలిసి సర్పంచ్ చిదురు శంకర్ రైతులకు యూరియ టోకెన్లు పంపిణీ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని రైతులకు సరిపడా యూరియా అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డ్ సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు.