విశాఖలో అద్భుతం... మరో మాయా ప్రపంచం
VSP: విశాఖ సాగర తీరంలో ఉన్న టీయూ 142 విమానం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన 'మాయా వరల్డ్'ను శుక్రవారం సంస్థ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా విశాఖలో ఏర్పాటు చేసిన ఈ మాయా వరల్డ్, నగరవాసులతో పాటు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని తెలిపారు.