VIDEO: ప్రొద్దుటూరు వైసీపీ దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత
KDP: ప్రొద్దుటూరులో వైసీపీ రిలే నిరసన దీక్షా శిబిరం వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత మునివర తన కుటుంబ సభ్యులతో కలిసి దీక్షా శిబిరం వద్దకు చేరుకుని తనను క్రికెట్ బుకీ అని ఎలా ఆరోపిస్తారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ క్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఖాజా ఇద్దరికి సర్ది చెప్పడంతో గొడవ సద్దుమనిగింది.