వరి రైతులు జాగ్రత్తలు వహిస్తే అధిక దిగుబడులు

తూర్పు గోదావరి: బుధవారం మండల కేంద్రమైన ఆలమూరులో వరి పొలాలను అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసుబాబు, మండల వ్యవసాయ సంచాలకులు కే.నాగేశ్వరరావు వారు సందర్శించారు. వారు మాట్లాడుతూ.. వరి పంటను పండించే సమయంలో రైతులు తగు జాగ్రత్తలు వహిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు