మున్సిపల్ కార్యాలయంలో వేసవి నీటి సరఫరాపై సమీక్ష
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో రాబోయే వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడా ఉండేందుకు కమిషనర్ ఎం.ఏసు బాబు వాటర్ వర్క్, ఇంజనీరింగ్ ఇతర విభాగాల సిబ్బందితో నీటి సరఫరాపై సమీక్ష చేశారు. పశ్చిమ డెల్టా కాలువకు ఏప్రిల్‌లో అడ్డుకట్ట వేసి నీటిని మళ్లించేందుకు కలెక్టర్ అనుమతి తీసుకోవాలని నిర్ణయించారు.