VIDEO: మీడియాకు స్వీట్లు పంచిన సీఎం
GNTR: అమరావతికి చట్టబద్ధత లభించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. రాజధానికి ఆమోదం దక్కడంపై తన సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులకు సీఎం స్వయంగా స్వీట్లు పంచిపెట్టారు. అమరావతికి ఇక అడ్డంకులు తొలగిపోవడం పట్ల ఆయన తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు.