VIDEO: అలుగు పోస్తున్న తూర్పుగూడెం చెరువు... రాకపోకలు బంద్

SRPT: తుంగతుర్తి మండలం తూర్పుగూడెంలోని చెరువు సోమవారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి అలుగు పోస్తోంది. వర్షపు నీరు మొత్తం రోడ్లపై ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బ్రిడ్జిపై నీళ్లు వస్తుండడంతో గానుగుబండ, తుంగతుర్తికి మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని స్థానికులు రామకృష్ణ కోరారు.